Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

Advertiesment
Heart Attack

సిహెచ్

, సోమవారం, 25 ఆగస్టు 2025 (21:52 IST)
గుండె పోటు. ఇది పనిదినాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యలో ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉంటుందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం పేర్కొంది. ఈ పరిస్థితిని ఉదయం సమయపు గుండెపోటు అని కూడా అంటారు. అయితే, ఆదివారాలు, సెలవుల్లో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది.
 
ఉదయం వేళ గుండెపోటు వచ్చే అవకాశం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. శరీరంలోని జీవగడియారం (సర్కాడియన్ రిథమ్) ఉదయం వేళ హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. ఈ సమయంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతాయి, దీంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
 
అదేవిధంగా నిద్ర నుంచి లేవగానే, రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఈ సమయంలో రక్తం గడ్డకట్టే (clotting) ప్రక్రియ కూడా చురుగ్గా ఉంటుంది. ధమనిలో కొవ్వు పేరుకుపోయిన వారికి, ఈ గడ్డలు ఏర్పడి గుండెపోటుకు కారణమవుతాయి. రాత్రి సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఉదయం తగినంత నీరు తాగకపోతే, రక్తం చిక్కగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఉదయాన్నే పడే ఒత్తిడి, ఆందోళన కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
 
వైద్య నిపుణుల సలహాలు ఏమిటంటే... ప్రతిరోజూ వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే... పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉప్పు, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. పొగతాగడం, మద్యం సేవించడం గుండెకు చాలా హానికరం. రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం. ఈ రెండూ గుండెపోటుకు ప్రధాన కారణాలు.
 
ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యం గురించి ఏవైనా అనుమానాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?