Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

Advertiesment
deadbody

ఐవీఆర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (20:10 IST)
మధురైలో జరిగిన మానాడు సమావేశానికి వెళ్లిన ఒక వాలంటీర్ మృత్యువాత పడ్డాడు. చెన్నై నుండి సమావేశానికి వెళ్లిన ప్రభాకరన్ అనే వాలంటీర్ సక్కిమంగళంలో మూత్ర విసర్జనకు వెళ్తూ స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆయనను మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు, కానీ చికిత్సకు ఆయన స్పందించలేదు. అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
 
గురువారం నాడు జరిగిన విజయ్ మానాడు సమావేశానికి సుమారు 4 లక్షల మంది దాకా ప్రజలు పాల్గొన్నట్లు చెప్పుకుంటున్నారు. ఉదయం 10 గంటలకే సమావేశ పెవిలియన్‌లోని అన్ని సీట్లు నిండిపోయాయి. తీవ్రమైన ఎండ వేడి కారణంగా 10 మంది వాలంటీర్లు స్పృహ కోల్పోయారు. వారిలో ఒకరిని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో, 9 మందిని వాయంకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు.
 
ఐతే గుండెపోటుతో ఒక వాలంటీర్ మరణించడం స్వచ్ఛంద సేవకులలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు : కేంద్రం ప్రతిపాదన