Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుస గుండెపోటు మరణాలు: తెలంగాణ హైకోర్టుకి వెళ్లాలంటే గుండె గుభేల్

Advertiesment
High Court lawyer Parsa Nageswara Rao dies of heart attack

ఐవీఆర్

, శనివారం, 9 ఆగస్టు 2025 (13:23 IST)
ఇటీవల తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో నలుగురు న్యాయవాదుల మరణాలకు గుండెపోటు కారణం కావడంతో అందరూ షాకవుతున్నారు. ఎంతో చలాకీగా వుండే న్యాయవాదులు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మరణించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య కాలంలో కేవలం గుండెపోటు కారణంగా మరణించిన న్యాయవాదుల సంఖ్య 4కి చేరింది. ఇటీవలే పర్స అనంత నాగేశ్వర రావుకి గుండెపోటు రావడంతో సోఫాలో కూర్చున్నచోటే కుప్పకూలి మరణించారు. దీనితో కోర్టు ప్రాంగణంలో వైద్య సేవలు అందుబాటులో వుండేట్లు చూడాలని న్యాయవాదులు కోరుతున్నారు. 
 
గురువారం పర్సా మృతి
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే హైకోర్టు న్యాయవాది పర్సా అనంత నాగేశ్వర రావు గుండెపోటుతో మృతి చెందారు. గురువారం నాడు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో న్యాయవాదులు, హైకోర్టు స్టాఫ్, క్లైంట్స్ చూస్తుండగానే మాజీ స్పెషల్ జిపి, ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ పర్సా అనంత నాగేశ్వర్ రావు గారు గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయారు.
 
ఎంతో భవిష్యత్తు వున్న అనంత నాగేశ్వ రావు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంపై ఆయన సహచరులు ఎంతో ఆవేదన చెందారు. వృత్తిలో ఎదుగుతున్న స్థితిలో ఈ విధంగా ఆయన చనిపోవడం చాల బాధాకరమనీ, నాగేశ్వరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పలువురు న్యాయవాదులు వెల్లడించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Elon Musk: ముంబైకి తర్వాత ఢిల్లీలో రెండో షోరూమ్‌ను ప్రారంభించనున్న టెస్లా