Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

Advertiesment
Pill

సిహెచ్

, సోమవారం, 25 ఆగస్టు 2025 (14:13 IST)
ఓ మతపరమైన వేడుకలో పాల్గొనేందుకు 18 ఏళ్ల యువతి రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ మాత్రలు వేసుకున్నది. ఆ తర్వాత ఆమె మృత్యువాత పడింది. ఢిల్లీలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా వున్నాయి. మృతి చెందిన బాలిక డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. లోతైన సిరలో రక్తం గడ్డకట్టిన సమస్యతో ఆమె బాధపడుతోంది. రుతుక్రమం జాప్యం అయ్యేందుకు ఆమె మాత్ర వేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తీవ్రమైన కాలు నొప్పి, వాపుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. ఐతే అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిచడంతో కన్నుమూసింది.
 
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధి మృతురాలి కాలు నుంచి నాభి వరకు విస్తరించి రక్తం గడ్డకట్టింది. మతపరమైన వేడుక కోసం ఆమె ఋతుస్రావాన్ని ఆలస్యం చేయడానికి హార్మోన్ల మాత్రలు తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తక్షణ చికిత్స కోసం వైద్యుడు అత్యవసరంగా సిఫార్సు చేసినప్పటికీ ఆమె తండ్రి దానిని ఆలస్యం చేయడంతో, సమస్య ఊపిరితిత్తుల వరకూ చేరి యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏమిటి?
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (Deep Vein Thrombosis) అంటే శరీరంలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం(క్లాట్). ఈ రక్తం గడ్డ తొడలు లేదా కాళ్లలో ఏర్పడి, ఛాతీకి ప్రయాణించి ఊపిరితిత్తులలోని రక్తనాళాలను అడ్డుకుంటుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. 
 
నొప్పి లేదా వాపుతో కూడుకుని వుంటుంది. కాలు లేదా చేయిలో నొప్పి, దురద, బరువుగా అనిపించడం, వాపు ఉండవచ్చు. ఈ అనారోగ్య వల్ల కాలు లేదా చేయి ప్రభావిత చర్మం ఎర్రగా మారడం లేదా వేడిగా అనిపించడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో గడ్డకట్టిన రక్తం (క్లాట్స్) విడిపోయి ఊపిరితిత్తులకు చేరితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, మైకం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... సిరలు దెబ్బతినడం వల్ల లేదా రక్త ప్రవాహం నెమ్మదిగా ఉన్నప్పుడు రక్తం గడ్డలు ఏర్పడతాయి. వయసు పెరగడం, సర్జరీలు, క్యాన్సర్ వంటివి DVT ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితి. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి, ముఖ్యంగా శ్వాసలో ఇబ్బంది ఉన్నప్పుడు తక్షణ వైద్య సహాయం అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు