Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Advertiesment
Continuous Glucose Monitoring

సిహెచ్

, మంగళవారం, 5 ఆగస్టు 2025 (23:07 IST)
డయాబెటిస్‌తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్‌ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.
 
కొంతమందికి, ఇది చిరాకు, నిరాశ లేదా భావోద్వేగ అలసటగా వ్యక్తమవుతుంది. మరికొందరికి, ఇది నిశ్శబ్ద తిరోగమనంగా, అంటే, గ్లూకోజ్ తనిఖీలను మిస్ చేసుకోవడం, మందులను దాటవేయడం లేదా అపాయింట్‌మెంట్‌లను నివారించడంగా ఉంటుంది. డయాబెటిస్ డిస్ట్రెస్ సాధారణంగా రోజువారీ నిర్వహణ నిరంతర డిమాండ్ల నుండి పుడుతుంది. ఇది నిరంతరం అప్రమత్తంగా ఉండటం వల్ల కలిగే భావోద్వేగ నష్టాన్ని ప్రతిబింబిస్తుంది. మానసిక, భావోద్వేగ ప్రభావాలను గుర్తించడం ద్వారా వ్యక్తులు సమతుల్యతను కనుగొనడం, విశ్వాసాన్ని పునర్నిర్మించడం, సహాయక వ్యవస్థలతో తిరిగి కనెక్ట్ అవ్వడం ప్రారంభించవచ్చు.
 
డయాబెటిస్ భారాన్ని తగ్గించడంలో సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డిస్ట్రెస్‌ను నిర్వహించడంలో ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుంది. నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ(సీజీఎం) పరికరాలు రియల్-టైమ్ బ్లడ్ గ్లూకోజ్ అలారాలను అందిస్తాయి, ఇవి మీ గ్లూకోజ్ చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు తెలియజేస్తాయి. అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా తోడ్పడుతాయి. ఇది నమూనాలు, ధోరణులను చూడటానికి, ఆహారం, కార్యాచరణ, ఇన్సులిన్ అనేవి గ్లూకోజ్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.
 
"డయాబెటిస్ నిర్వహణకు శరీరం, మనస్సు రెండింటినీ పెంపొందించే సమగ్ర విధానం అవసరం. ప్రభావవంతమైన డయాబెటిస్ నిర్వహణ అంటే సమతుల్యతను సాధించడం. చక్కటి దినచర్యలో పోషకయుక్త ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, సుస్థిర గ్లూకోజ్ పర్యవేక్షణ ఉంటాయి. నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) పరికరాలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. గ్లూకోజ్ ధోరణులపై నిజ-సమయ ఇన్‌సైట్స్‌ను అందించడం ద్వారా ఇవి ఆయా వ్యక్తుల నిర్దిష్ట ఆహారాలు, కార్యకలాపాలు లేదా ఒత్తిళ్లు వారి స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ తక్షణ అభిప్రాయం ప్రజలు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది, అనిశ్చితిని తగ్గిస్తుంది. డయాబెటిస్ భావోద్వేగ భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది’’ అని హైదరాబాద్ లోని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ కృష్టారెడ్డి తాడూరి అన్నారు. 
 
ఒంటరితనం తక్కువగా ఉన్నప్పుడు డయాబెటిస్ డిస్ట్రెస్ తరచుగా తగ్గుతుంది. కుటుంబ శక్తి, సమాజ శక్తి బయటపడేది అక్కడే. కనెక్ట్ చేయబడిన సంరక్షణ ద్వారా, డయాబెటిస్ ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని నిర్వహించే బాధ్యతను కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఇది వారి ఆరోగ్యాన్ని బాధ్యతగా తీసుకోవడానికి, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో మరింత అర్థవంతమైన సంభాషణలు చేయడానికి ప్రజలకు విశ్వాసాన్ని ఇస్తుంది.
 
‘‘డయాబెటిస్ బాధను తగ్గించడానికి, బర్న్అవుట్‌ను నివారించడానికి, నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్(సీజీఎం) పరికరాలు మారుతూ వస్తున్నాయి. నేటి సీజీఎంలు ట్రాకింగ్‌కు మించి పనిచేస్తాయి. అవి కనెక్షన్‌ను పెంపొందించే సమగ్ర డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌లుగా పనిచేస్తాయి. ప్రియమైనవారితో, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో రియల్-టైమ్ గ్లూకోజ్ డేటాను పంచుకోవడానికి వీలు కల్పించడం ద్వారా సీజీఎంలు సహాయక, సమాచారం ఉన్న సంరక్షణ నెట్‌వర్క్‌ను సృష్టించడంలో సహాయపడతాయి" అని అబాట్‌ దక్షిణాసియా మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ వివేక్ అయ్యర్ అన్నారు.
 
మధుమేహ ప్రయాణాన్ని నిర్వహించడానికి సహాయపడే సాంకేతికత, పరిశోధనల మద్దతు ఉన్న కొన్ని వ్యూహాలు:
1. భారాన్ని తగ్గించుకోడానికి సాంకేతికతను ఉపయోగించండి: నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్(సీజీఎం) పరికరాలు మధుమేహం ఉన్నవారికి వారి జీవితాన్ని మార్చేస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి, రోజువారీ నిర్వహణను సులభతరం చేయడానికి సహాయపడే రియల్ టైమ్ ఇన్ సైట్స్‌ను అందిస్తాయి. నొప్పి లేకుండా ఉండే ప్రిక్ ఫ్రీ పరికరాలు ప్రతి నిమిషం మీ రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ చేస్తాయి. విజువల్ ట్రెండ్స్‌ను ఉత్పత్తి చేస్తాయి, మీ గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా మారడాని కంటే ముందుగానే మీరు తగు చర్య తీసుకోవడానికి వీలు కల్పిస్తాయి.
 
2. దినచర్య, ఆనందం ద్వారా సమతుల్యతను కనుగొనండి: బర్నౌట్ తరచుగా ప్రతిదీ పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించడం నుండి పుడుతుంది. పరిపూర్ణతను వదిలివేసి మీ స్వంత సమతుల్యతను కనుగొనండి. మధుమేహాన్ని, మీ మొత్తం శ్రేయస్సు నిర్వహించడానికి మీకు అవసరమైన అత్యంత ముఖ్యమైన కార్యకలాపాలు, ఆరోగ్య లక్ష్యాలను గుర్తించండి. దాంతో ఆ ఆరోగ్య లక్ష్యాలు మరింత సాధించదగినవిగా, సుస్థిరమైనవిగా అనిపించవచ్చు.
 
3. చురుకుగా ఉండండి, బుద్ధిపూర్వకంగా తినడంపై దృష్టి పెట్టండి: నడక, యోగా, ఈత, డ్యాన్స్, వెయిట్ ట్రైనింగ్ మొదలైన మితమైన తీవ్రత కలిగిన ఏరోబిక్, రెసిస్టెన్స్ ఆధారిత వ్యాయామాల మిశ్రమాన్ని వారానికి సుమారు 150 నిమిషాలు మధుమేహం ఉన్నవారికి తరచుగా సిఫార్సు చేస్తారు. కదలిక అనేది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. మీ భోజనం కూడా ముఖ్యం. సమతుల్య ఆహారాన్ని ఎంచుకోండి, బుద్ధిపూర్వకంగా తినడం సాధన చేయండి.
 
చివరగా, మీరు ఆనందించే విషయాలకు సమయం కేటాయించండి. అది ఎవరితోనైనా సమయం గడపడం కావచ్చు లేదా ఒక అభిరుచిని కొనసాగించడం అయినా కావచ్చు. అత్యంత ముఖ్యమైన దానిపై దృష్టి పెట్టండి. మీరు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని సృష్టించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?