Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Advertiesment
Kavitha

సెల్వి

, బుధవారం, 3 సెప్టెంబరు 2025 (13:32 IST)
Kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాకుండా ఆమె పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇకపోతే.. కవిత చేసిన వ్యాఖ్యలు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా చేశాయి. పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఆమె సోదరుడు కేటీఆర్‌ను హెచ్చరించారు.
 
ఈ మేరకు విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని హరీష్ రావు విభజించారని ఆరోపించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, కుట్రదారుడు.. అని కవిత ఆరోపించారు. పార్టీ నుండి నా సస్పెన్షన్ నన్ను బాధించింది. కానీ అది ప్రజలకు మద్దతుగా పోరాడకుండా నన్ను ఆపలేదు, ఎటువంటి వివరణ తీసుకోకుండా నన్ను పార్టీ నుండి బయటకు పంపడానికి కుట్ర జరిగిందని కవిత చెప్పుకొచ్చారు. 
 
బీఆర్‌ఎస్ నేత జె. సంతోష్ రావు, అతని సహాయకులు తనపై కుట్ర పన్నారని కవిత విమర్శించారు. ఆమె భవిష్యత్తు కార్యాచరణ గురించి అడిగినప్పుడు, నేను దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాలమే నిర్ణయిస్తుందని కవిత అన్నారు. బీఆర్ఎస్‌కు హరీష్ రావు, సంతోష్ రావులు మరింత నష్టం కలిగిస్తున్నారని కవిత ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్