అథర్వా మరోసారి తనకు కలిసి వచ్చిన ఖాకీ చొక్కా, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకుని టన్నెల్ అనే మూవీని చేశారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీని తెలుగులోకి ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడులో ఈ ట్రైలర్ సెన్సేషన్‌గా మారింది. క్రూరమైన హత్యలు, వాటి వెనుకున్న సైకోని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? సమాజాన్నే తన కుటుంబం అనుకునే పోలీస్ చివరకు ఆ సైకోని పట్టుకున్నారా? లేదా? అన్న అంశాలతో ఆసక్తికరంగా, గ్రిప్పింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌ను కట్ చేశారు.
జస్టిన్ ప్రభాకరన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. కలైవానన్ ఈ సినిమాకు ఎడిటర్. తెలుగు వెర్షన్ ప్రమోషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. అతి త్వరలోనే తెలుగు వర్షెన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసి ఇక్కడా అంచనాలు పెంచనున్నారు. ఇక అథర్వా మురళీ సైతం తెలుగు ప్రమోషన్స్‌లో సందడి చేయబోతోన్నారు.