దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్ల కోసం నెట్‌వర్క్-సైడ్ యాంటీ-స్పామ్, యాంటీ-ఫిషింగ్ ప్రొటెక్షన్ అమలు చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఇన్‌స్టాల్ చేయడానికి యాప్ లేదు, మార్చడానికి సెట్టింగ్‌లు లేవు ఇకపై.. ఎస్ఎంఎస్‌లోని అనుమానాస్పద, ఫిషింగ్ యూఆర్ఐలు సరైన సమయంలో గుర్తించబడతాయి.
నెట్‌వర్క్ అంచున నిలిపివేయబడతాయి. కాబట్టి బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నకిలీ లింక్‌లు డెలివరీ చేయబడవు. అయితే చట్టబద్ధమైన ఓటీపీలు, బ్యాంకింగ్ హెచ్చరికలు, ప్రభుత్వ సందేశాలు ట్రాయ్ డీఎల్టీ/యూసీసీ ఫ్రేమ్‌వర్క్ కింద వుంటాయి.
అంతర్లీన సాంకేతికత స్మిషింగ్‌కు వ్యతిరేకంగా 99 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం కోసం గుర్తించబడింది. లైవ్ సర్కిల్‌లలోని అన్ని బీఎస్ఎన్ఎల్ మొబైల్ సబ్‌స్క్రైబర్లకు డిఫాల్ట్‌గా సేఫ్టీ ఆన్‌లో ఉంటుంది.
మరోవైపు కస్టమర్లను ఆకర్షించేందుకు విస్తృత స్థాయిలో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించేలా ప్లాన్లు తీసుకొస్తోంది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రూపాయికే కొత్త సిమ్ అందించేలా 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా ప్లాన్ తెచ్చింది.