కథానాయకుడు తేజ సజ్జా పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. నిన్న మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 12న మిరాయ్ రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ డివోషన్ ఎమోషన్ ఎలివేషన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసే సినిమాలు ఒక ఏడాదిలో చాలా తక్కువగా వస్తుంటాయి. మిరాయి అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే సినిమా అంటూ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
మిరాయ్ అంటే మీనింగ్?
-మిరాయ్ అంటే హోప్ ఫర్ ఫ్యూచర్. దీనికి మరో అర్థం కూడా ఉంది. అది మీరు సినిమాలో చూస్తున్నప్పుడు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు.
ఈ సినిమాని జపాన్, చైనీస్ లో కూడా రిలీజ్ చేయడానికి కారణం?
-మన ఇండియన్ సినిమాకి జపాన్ చైనీస్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. హనుమాన్ కూడా చైనా జపాన్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా అక్కడ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది.
ఇందులో శ్రీరాముని నేపధ్యం ఏ మేరకు ఉంటుంది?
-కథలో సరైన సమయంలో ఆ నేపథ్యం వస్తుంది. ఆడియన్స్ కి కావలసిన హై ఇస్తుంది. కచ్చితంగా సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది.
మీరు ఎక్కువగా ఫాంటసీ సినిమాలు చేయడానికి కారణం?
-నాలో ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడు. ఫాంటసీ సినిమాలు చూడడం చాలా ఇష్టం. రియల్ లైఫ్ లో ఇలాంటి లార్జర్ ఈవెంట్స్ ని చూడలేము.అందుకే తెరమీద చూపించాలనే ప్రయత్నం.
ఫాంటసీ సినిమాలు చేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటి?
-వీఎఫ్ఎక్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ గా దూసుకుపోతుంది. కార్తీక్ గారు ప్రశాంత్ గారు లాంటి డైరెక్టర్స్ తో కొలాబరేట్ అవుతూ ఇలాంటి ఫాంటసీ సినిమాలు చేయడం చాలా ఆనందాన్నిస్తుంది. ఈ సినిమాలో చాలా అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ని చూడబోతున్నారు
హనుమాన్ కి మిరాయ్ కి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
-హనుమాన్ అంజనాద్రి అనే ఒక ఫాంటసీ ప్లేస్ లో జరిగిన కథ. మిరాయి దేశాలు దాటి జరిగే కథ. క్యారెక్టర్స్ పరంగా హనుమాన్ మిరాయ్ డిఫరెంట్ ఫిలిమ్స్.
-హనుమాన్ కి మేము ఊహించిన దాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మిరాయ్ లాంటి బిగ్ స్కేల్ సినిమాలు చేసే అవకాశం హనుమాన్ సినిమా కల్పించింది. మిరాయ్ కూడా ఆడియన్స్ ని అలరిస్తుందని నమ్మకం ఉంది.
ట్రైలర్లో యాక్షన్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. మీరు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా అయ్యారని విన్నాం..?
-ఈ సినిమాకి ఫాస్ట్ యాక్షన్ చేశాం రెగ్యులర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇందులో ఉండదు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ ఈ సినిమాకి పనిచేశారు.
-ఈ సినిమా కోసం థాయిలాండ్ వెళ్లి 20 రోజులు పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ఇందులో మీరు చూసిన స్టంట్స్ నేను స్వయంగా చేసినవే. ఎలాంటి బాడీ డబుల్స్ ఉపయోగించలేదు.
- శ్రీలంక, హిమాలయాస్, నేపాల్, ఇలా ఎన్నో అద్భుతమైన లైవ్ లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేయడం జరిగింది. నిర్మాత విశ్వప్రసాద్ గారి పాషన్ వల్లే ఇంత అద్భుతమైన ప్రాజెక్టు సాధ్యపడింది
తమిళ్ లో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?
-నాకు తమిళ్ లో చాలా మంచి డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను.