Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mirai: కూలిపోతున్న వంతెన మీద స్టిక్ తో మిరాయ్ లో తేజ లుక్

Advertiesment
Teja Sajja's look in Mirai

దేవీ

, శనివారం, 23 ఆగస్టు 2025 (17:24 IST)
Teja Sajja's look in Mirai
హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిరాయ్‌'లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న మిరాయ్ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌లలో ఒకటిగా మారనుంది.
 
తేజ సజ్జ బర్త్‌డే సందర్భంగా మిరాయ్ మూవీ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో తేజ సూపర్ యోధ అవతార్ ని అదిరిపోయేలా చూపించారు. కూలిపోతున్న వంతెన మీద చేతిలో కేవలం ఒక స్టిక్ తో నిలబడి పోరాడుతున్న తేజ లుక్ అదిరిపోయింది. ఆ పోస్టర్ ఆయన పాత్రలో ఉన్న పట్టుదల, ధైర్యం, మిరాయి లో ఉన్న హై వోల్టేజ్ డ్రామాని రిప్రజెంట్ చేస్తుంది.
 
ఈ చిత్రంలో రీతికా నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా, శ్రీయా శరన్, జయరాం, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ మిరాయ్ హిందీ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేస్తున్నారు.
 
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.
 
మిరాయ్ 2D , 3D ఫార్మాట్‌లలో ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది ట్రూ పాన్-ఇండియన్  విజువల్ వండర్ గా ఉండబోతుంది.
 
తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్