Sanjay Dutt look from Rajasaab
ఈ డిసెంబర్ 5న సినిమా థియేటర్లలో మిమ్మల్ని కదిలించే భయానక ఉనికిని చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ బాలీవుడ్ సంజయ్ దత్ పోస్టర్ ను రాజాజాబ్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మూడొంతులు పూర్తయింది. కొంత భాగం రీ ష్యూట్ కూడా చేస్తున్నారు.
ఈ చిత్ర కథ కూడా అందరికి తెలిసిందే. ప్రేమ కథా చిత్రమ్ కు కొనసాగింపుగా వుంటుందని టాక్ కూడా బయటకు వచ్చింది. “ది రాజా సాబ్” హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న భారీ చిత్రం టీజర్ తర్వాత మాత్రం మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది. ఇందులో సంజయ్ దత్ పాత్ర ఎలా వుంటుందనే సస్పెన్స్ అంటూ మారుతీ తెలియజేస్తున్నారు.
నేడు సంజయ్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ సంజయ్ సంజు బాబాగా ఒక వయసు మళ్ళిన ముసలి రాజుగా మీసం మెలేస్తూ, సాలీడు గూళ్ళ నడుమ భయానకంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా టీజీ విశ్వ ప్రసాద్, ఇషాన్ సక్సేనాలు నిర్మాతలు.