వరుస పాన్-ఇండియా హిట్స్ అందించిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్పిరిట్' లోకి ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హై-ఆక్టేన్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం సంచలనం క్రియేట్ చేసే పవర్ ఫుల్ కాంబోని చూస్తోంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా త్రిప్తి దిమ్రి కనిపించనుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌లో తన అద్భుతమైన నటనతో పేరుతెచ్చుకున్న త్రిప్తి ఫస్ట్ టైమ్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి నుండి ప్రారంభం కానుందని టీం అధికారికంగా తెలియజేసింది. ఇది గ్రాండ్ సినిమాటిక్ జర్నీకి ప్రారంభాన్ని సూచిస్తుంది.
స్పిరిట్ గ్లోబల్ మూవీగా రూపొందుతోంది. దీనిని తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కేల్, యూనివర్సల్ అప్పీల్ తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అలరించబోతోంది.
ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. మ్యాసీవ్ స్కేల్, ఫ్రెష్ లీడ్ పెయిర్, బ్లాక్ బస్టర్ దర్శకుడితో స్పిరిట్ ఇండియన్ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్‌గా మారనుంది.