విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ప్రమోషన్ కోసం సందీప్ రెడ్డి వంగా నడుం బిగించాడు. జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన కెరీర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో రెండు షేడ్స్ లో వుంటాయని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత అంత స్థాయి సక్సెస్ లేదని చిత్ర నిర్మాత నాగవంశీ కూడా వెల్లడించారు. అందుకే కింగ్ డమ్ పై కొత్త ప్రయోగానికి దిగారు.
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన సందీప్ రెడ్డి వంగాతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇలా చేయాలని విజయ్ అభిమానులు ఆశించినట్లే నేడు చిత్ర దర్శకుడు గౌతమ్ కూడా కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామానాయుడు స్టూడియోలో వేసిన సెటప్ లో ఇది జరిగిందని తెలుస్తోంది. ఇంటర్వ్యూ అధికారికంగా పూర్తయింది, సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సంభాషణ కోసం కూర్చున్నారు. షూటింగ్ నుండి ముగ్గురి చిత్రం ఆన్‌లైన్‌లో విడుదలైంది, దీనితో విజయ్ అభిమానుల్లో ఉత్సాహం పొంగింది. మరి ఎటువంటి ప్రశ్నలు, సమాధానాలు వుంటాయో త్వరలో తెలియనుంది.