Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

Advertiesment
Mirai trailer poster

దేవీ

, గురువారం, 28 ఆగస్టు 2025 (16:32 IST)
Mirai trailer poster
హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రమే “మిరాయ్”. ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. ఈ చిత్ర ట్రైలర్ హైదరాబాద్ లోని ఐమాక్స్ లో విడుదల చేశారు. అక్కడ అగ్ర హీరోల స్థాయిలో కటౌట్ పెట్టడం విశేషం. దీనిపై తేజ మాట్లాడుతూ, నాకు దర్శక, నిర్మాతలు సర్ ప్రైజ్ చేశారు. నేను బాల నటుడిగా వున్నప్పుడు అగ్ర హీరోలు కటౌట్లు థియేటర్లలో చూసేవాడిని. ఇప్పుడు మిరాయి తో నన్ను ఆ స్థాయికి తెచ్చేలా ప్లాన్ చేశారు అన్నారు.
 
Miyai cutouts at Prasad Imax
ట్రైలర్ పరంగా చూస్తే, అశోకుని కాలంలో 9 శక్తివంతమైన గ్రంథాలు వాటి కోసం వెతికే విలన్ వాటిని అతడికి చిక్కకుండా చేసేందుకు పోరాటం చేసే హీరో ఈ మధ్యలో సాలిడ్ యాక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ గగుర్పాటు కలిగిస్తాయి. వింతగా అనిపిస్తాయి. ఇందులో విలన్ గా మనోజ్ పాత్ర హైలైట్ గా వుంటుంది. దీనిపై తేజ మాట్లాడుతూ, మా వయస్సులో వున్న వాళ్ళమంతా మనోజ్ చిత్రాలు చూసేవాళ్ళం. తనలో అద్భుతమైన టాలెంట్ వుంది. ఈ సినిమాలో పాత్ర చాలా బాగుంటుంది. మా సినిమాలో పనిచేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నారు.
 
కథపరంగా చెప్పాలంటే. అశోకుని కాలంలో గ్రంథాలను శోధించే ప్రకియలో సినిమా వుంటుంది. ఓ తల్లి కోరిక మేరకు కొడుకు ఏం చేశాడనేది సింపుల్ కథ. ఈ కథను నేను హనుమాన్ సినిమా విడుదలకు ముందే కమిట్ అయ్యాను.అప్పటినుంచి ఇండియాలో చాలా చోట్ల షూటింగ్ చేశాం. నన్ను పాన్ ఇండియా హీరో అంటూ అభిమానులు కేకలు వేస్తున్నారు. కానీ నేను తెలుగు హీరోనే. ఇక్కడే సినిమాలు చేస్తాను అని తేజ చెప్పారు. జగపతి బాబు గారితో మొదటిసారి సినిమా చేశాను. శ్రేయ గారితో బాలనటుడిగా సినిమాుల చేశాను అని తెలిపారు.
 
సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. కార్తీక్ గట్టా, రితికా నాయక్, విశ్వ ప్రసాద్ tg, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గౌరా హరి కె తదితర సాంకేతిక సిబ్బంది పనిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన