బాలీవుడ్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహుజాలు విడాకులు తీసుకున్నారంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై సునీత ఎట్టకేలకు స్పందిచారు. నా గోవిందా నాకే సొంతం అంటూ స్పష్టం చేశారు. పైగా, వినాయక చవితి వేడుకల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ గణేశ ఉత్సవాల్లో వారిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి, తమ విడాకులపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ, మీరు గణపతి కోసం వచ్చారా? లేకా మా వివాదం కోసం వచ్చారా? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మమ్మల్లి ఇంత దగ్గరగా చూశాక కూడా మీకు అనుమానాలు ఉన్నాయా?, మా మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?, అలా ఉంటే ఇలా కలిసి ఉండేవాళ్లం కాదు. దేవుడు గానీ, దెయ్యంగానీ మమ్మల్ని విడదీయలేవు. నా భర్త నాకే సొంతం. నా గోవిందా నాకే సొంతం. దయచేసి ఎవరూ ఈ పుకార్లను నమ్మవద్దు. మేం స్వయంగా చెబితే తప్ప దేనినీ విశ్వసించకండి అని ఆమె స్పష్టం చేశారు. కాగా, సునీత విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పత్రాలు దాఖలు చేశారనే విషయం బయటకురావడంతో ఈ వివాదం మొదలైంది.