మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. దైవకార్యాలు, ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య తరచుగా కలహాలు. పనుల ప్రారంభంలో ఎట్టకేలకు పూర్తికాగలవు. తరుచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. విదేశాల నుంచి సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్, చెల్లింపుల్లో జాప్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి - వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ప్రారంభోత్సవాలు, అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొంటారు
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. గృహ వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకం. కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. ఆప్తుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. సర్వత్రా ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవి దక్కక పోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు, కానుకలు అందిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగ విధులపై దృష్టి పెట్టండి. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. చిరువ్యారుల ఆదాయం బాగుంటుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభసమయం ఆసన్నమైంది. ప్రతికూలతలను అధిగమిస్తారు. లక్ష్యానికి చేరువవుతారు. స్థిరచరాస్తి మూలక ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో తరచూ కాలక్షేపం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ ఆ లక్ష్యం సమస్యకు దారితీస్తుంది. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలు ఎదుర్కుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. దైవదర్శనాల్లో అవస్థలు ఎదుర్కుంటారు.
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసాధనకు ధృఢ దీక్షతో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. న్యాయ, వైద్య, రంగాల వారి ఆదాయం బాగుంటుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం ప్రధమార్ధం అనుకూలం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ శ్రమ ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. మిమ్ములను సన్నిహితులతో సంభాషణ ఉత్సాహం కలిగిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ధృఢదీక్షతో శ్రమించండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్కులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంస్థల స్థాపనకు అనుకూలం. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. సంతానం నిర్లక్ష్యం అసహనం కలిగిస్తుంది. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, బాధ్యతల మార్పు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. విందులకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగలు, ఆభరణాలు జాగ్రత్త.
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కార్యానుకూలత ఉంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో జాప్యం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. అవివాహితులకు శుభయోగం. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఆలయాలకు విరాళాలందిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో ముందుకు సాగండి. సంకల్పబలంతోనే కార్యం విజయవంతమవుతుంది. పెద్దల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు తగదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్ననం చేసుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
గ్రహస్థితి సామాన్యం. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ధృఢదీక్షతో యత్నాలు సాగించండి. శ్రమ ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. సంకల్పబలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పొగిడే వ్యక్తుల అంతర్యం గ్రహించండి. దంపతుల అరమరికలు తగవు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ మేధస్సుకు పదును పెట్టండి. తెలివితేటలతో రాణించగలరు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను దక్కించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అశక్తతను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ముఖ్యులతో సంభాషిస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. అధికారులు మీ పదోన్నతికి సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. దైవకార్యం, విందులకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలు కొలిక్కివస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా మొండిగా పూర్తి చేస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. సంతానం దూకుడు కట్టడి చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. న్యాయనిపుణులను సంప్రదిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.