Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశుల వారిపై ప్రభావం అధికంగా ఉంటుంది?

Advertiesment
blood moon

ఠాగూర్

, మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (18:13 IST)
ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది కనిపించనుంది. ఈ గ్రహణం మనకు విశేషంగా శతభిష నక్షత్రంలో, కుంభ రాశిలో ఏర్పడబోతోంది. చిలకమర్తి పంచాంగ రీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ చంద్ర గ్రహణం రాత్రి 9గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటిగంట 26 నిమిషాల వరకు ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
 
గ్రహణ వ్యవధి కాలం మూడు గంటల 30 నిమిషాలు ఉంటుందన్నారు. రాత్రి 11.42 నిమిషాలకు గ్రహణ మధ్యస్థ కాలమని పేర్కొన్నారు. ఈ చంద్ర గ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనబడబోతోందని, భారతదేశంపైనా దీని ప్రభావం ఉందన్నారు. సూత కాలం, ఏయే రాశివారు గ్రహణం చూడకూడదనే అంశాలతో పాటు ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎలాంటి నియమాలు ఆచరించాలో ఈ వీడియోలో చూడొచ్చు.
 
* భారత్, రష్యా, సింగపూర్, చైనాలో కొన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ ఏడో తేదీ సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలి. తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు గంటల లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలి. ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగేవరకూ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది.
 
* గ్రహణ సమయంలో నిద్ర పోవద్దన్నది శాస్త్రం. చంద్ర గ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమం. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉంచడం ఉత్తమం.
 
* గ్రహణ కాల వ్యవధిలో ఇంటి లోపలే ఉండేలా చూసుకోండి. గర్భిణీలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి ముందు తల స్నానం, గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. 
 
* గ్రహణ సమయంలో ఇంట్లో పూజా మందిరం, ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు (ఊరగాయ) వంటి వాటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం.
 
* ఈ గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది.
 
* గ్రహణం సమయంలో దుర్గా దేవిని పూజించడం, రాహు జపం చేయడం, వెండి వంటివి దానం చేయడం, పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభఫలితాలు ఇస్తాయి. కొన్ని రాశుల వారికి (కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం) ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Parivartini Ekadashi 2025: పరివర్తని ఏకాదశి ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలి.. కృష్ణుడు యుధిష్ఠిరునికి...?