Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Advertiesment
OG glimps pawankalyan

దేవీ

, మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (17:22 IST)
OG glimps pawankalyan
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ' నుండి పోస్టర్, గ్లింప్స్ విడుదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా అనిపించేట్లుగా అందులో సిగార్ తాగుతున్న పవన్ ను చూపించగానే, డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నానంటూ ఓ పొడవాటి కత్తితో వెళుతున్న విలన్ ను చూపిచడంతో గ్లింప్స్ లో హ్యాపీ బర్త్ డే ఓజీ. అంటూ వినూత్నంగా వుండడంతోపాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. “HBD OG - LOVE OMI” పేరుతో ఓ సంచలనాత్మక గ్లింప్స్ ను విడుదల చేసింది.
 
వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్ రాకతో సామాజిక మాధ్యమాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఈ తరహా లుక్ లో చూసి చాలా కాలం అయిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ ను ఇంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన శైలిలో చూపించినందుకు అభిమానులు, సినీ ప్రేమికులు.. దర్శకుడు సుజీత్ మరియు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఓజీ' అనే టైటిల్ కి తగ్గట్టుగానే పోస్టర్ కూడా ఎంతో శక్తివంతంగా ఉంది. 
 
పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం “HBD OG - LOVE OMI” అనే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి నుండి 'ఓజీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను గంభీరమైన అవతారంలో చూపించిన హంగ్రీ చీతా గ్లింప్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు “HBD OG - LOVE OMI” గ్లింప్స్‌ సినిమా యొక్క మరో విస్ఫోటన కోణాన్ని వెల్లడిస్తుంది. తాజా గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు.
 
'ఓజీ' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్, పాటలు కట్టిపడేశాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా 'ఓజీ' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్, అద్భుతమైన విజువల్స్, సంగీతం, సంభాషణలు ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. 
 
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?