తమ మొబైల్ వినియోగదారులకు వోడాఫోన్ ఐడియా కంపెనీ శుభవార్త చెప్పింది. దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. తొలుత ముంబై నగరంలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు ప్రారంభించింది. వచ్చే ఢిల్లీ, బెంగుళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్‌లకు సేవలు విస్తరణ చేపట్టనుంది. రూ.299 ప్యాక్ నుంచి 5జీ సేవలు ప్రారంభించింది. వచ్చే మూడేళ్లలో 17 సర్కిళ్ళలోని 100 నగరాలకు 5జీ సేవలను విస్తరించనుంది.
ప్రస్తుతానికి అపరిమిత యాడ్ ఆన్ కింద రూ.299తో మొదలయ్యే పథకాల్లో 5జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. తొలి దశ విస్తరణ అనంతరం మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, చెన్నైలకు 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్జీర్ సింగ్ తెలిపారు. ఫైబర్ కేబుళ్లు, సెల్ టవర్లు వంటి సంప్రదాయ అనుసంధాన వసతులు లేని ప్రదేశాల్లో శాటిలైట్ సేవల కోసం కొన్ని సంస్థలతో చర్చిస్తున్నట్టు జగ్జీర్ సింగ్ తెలిపారు.