Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 29 జులై 2025 (23:28 IST)
హైదరాబాద్:  లైఫ్ సైన్సెస్, డయాగ్నస్టిక్స్ , అప్లైడ్ కెమికల్ మార్కెట్లలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన ఎజిలెంట్ టెక్నాలజీస్, ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ కొత్త బయోఫార్మా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ కేంద్రం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న లైఫ్ సైన్సెస్ రంగంలో గణనీయమైన పెట్టుబడిని సూచిస్తుంది. స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా బయోఫార్మాస్యూటికల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ఎజిలెంట్ యొక్క దీర్ఘకాలిక నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు- పరిశ్రమల శాఖ గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎజిలెంట్ అధ్యక్షుడు, సీఈఓ పాడ్రైగ్ మెక్‌డొన్నెల్, భారతదేశంలోని ఫార్మాస్యూటికల్, బయోఫార్మా రంగాలకు చెందిన సీనియర్ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.
 
హైదరాబాద్‌లోని కొత్త ఎజిలెంట్ బయోఫార్మా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఆవిష్కరణలలో నగరం యొక్క నాయకత్వాన్ని వేగవంతం చేయడానికి ఒక ప్రధాన అవకాశాన్ని అందిస్తుంది. పూర్తి ఔషధ అభివృద్ధి ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిన ఈ కేంద్రం, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, కంపెనీలు అధిక-నాణ్యత కలిగిన ప్రాణ రక్షక ఔషదాలను వేగంగా, మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి అధునాతన ప్రయోగశాల సాంకేతికతలు, నిపుణుల శిక్షణ, నియంత్రణ-సిద్ధమైన వర్క్‌ఫ్లోలను ఒకచోట చేర్చింది. ఇది క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోమెట్రీ, సెల్ విశ్లేషణ, ల్యాబ్ ఇన్ఫర్మేటిక్స్ వంటి కీలక పద్ధతులలో సమగ్రమైన పరిష్కారాలను అందిస్తుంది, కంపెనీలు నిజమైన ప్రయోగశాల వాతావరణాలను అనుకరించడానికి, నాణ్యత, సమ్మతి కోసం పరీక్షించడానికి, భారతీయ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న పరిష్కారాలను సహ-సృష్టించడానికి అనుమతిస్తుంది.
 
హైదరాబాద్‌లోని స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, నైపుణ్యం కలిగిన నిపుణుల శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ కోసం, ఈ కేంద్రం ప్రపంచ నైపుణ్యం, అత్యాధునిక పరికరాలు, వాస్తవ-ప్రపంచ వినియోగ వాతావరణాలను నేరుగా చేరుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇది వేగవంతమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్&డి ), అంతర్జాతీయ నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఆచరణాత్మక శిక్షణ, పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య బలమైన సహకారానికి మద్దతు ఇస్తుంది. బయోసిమిలర్లు, బయోలాజిక్స్, ప్రెసిషన్ మెడిసిన్‌లలో కీలకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా, ఈ సౌకర్యం తదుపరి తరం ఔషధ అభివృద్ధికి విశ్వసనీయ ప్రపంచ కేంద్రంగా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది, భారతదేశ బయోఫార్మా వృద్ధి కథకు కీలక సహకారిగా నిలుస్తుంది.
 
"ఎజిలెంట్‌కు భారతదేశం వ్యూహాత్మక వృద్ధి మార్కెట్. బయోఫార్మా ఆవిష్కరణలలో హైదరాబాద్ ముందంజలో ఉంది" అని ఎజిలెంట్ టెక్నాలజీస్ సిఇఒ పాడ్రైగ్ మెక్‌డొనెల్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ "నిరంతర ఆవిష్కరణలు, మా కస్టమర్లపై నిరంతరం దృష్టి సారించటం ద్వారా మా భవిష్యత్తు నిర్వచించబడుతుంది. జీవితాన్ని మార్చే చికిత్సలను వేగంగా, మరింత సమర్థవంతంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి సహాయపడే ఇంటిగ్రేటెడ్ పరిష్కారాలను అందించడంలో మా నిబద్ధతను ఈ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తుంది. స్థానిక ఆవిష్కరణలకు సాధికారత కల్పించడం, ప్రతిభను పెంపొందించడం మరియు వ్యాప్తి చేయతగిన, సరసమైన , స్థిరమైన పరిష్కారాలను అందించటం ద్వారా 'మేక్-ఇన్-ఇండియా' కార్యక్రమానికి మా మద్దతును ఇది బలోపేతం చేస్తుంది" అని అన్నారు. 
 
భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధాని నడిబొడ్డున ఉన్న ఈ కేంద్రం, బయోఫార్మా కంపెనీలకు విశ్లేషణాత్మక సామర్థ్యాలు, నియంత్రణ సంసిద్ధతలో ఉన్న కీలకమైన అంతరాలను పరిష్కరించడానికి తీర్చిదిద్దబడింది. ఇది బయోలాజిక్స్, బయోసిమిలర్లు మరియు ప్రెసిషన్ మెడిసిన్ అభివృద్ధికి మద్దతు ఇస్తూ, ఆవిష్కరణ, సహకారానికి కేంద్రంగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు మరియు పరిశ్రమల గౌరవనీయ మంత్రి శ్రీ దుద్దిళ్ల  శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “ఔషధ ఆవిష్కరణ, క్లినికల్ ట్రయల్స్ నుండి ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, సరసమైన, అధిక-నాణ్యత గల రోగి సంరక్షణ వరకు హైదరాబాద్ పూర్తి ఆరోగ్య సంరక్షణ మరియు లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థగా అవతరించింది. 
 
ప్రపంచంలోని టాప్ పది ఫార్మా కంపెనీలలో ఎనిమిది, భారతదేశంలోని ఐదు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ చైన్ ఆస్పత్రులు మరియు 230 కి పైగా USFDA-ఆమోదించిన తయారీ సౌకర్యాలకు నిలయంగా నిలవటం మాకు గర్వకారణంగా ఉంది. భారతదేశంలోని ఔషధ ఉత్పత్తిలో మూడింట ఒక వంతు మరియు బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 40%తో, తెలంగాణ జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా  అత్యధిక ప్రభావాన్ని చూపుతోంది. ఎజిలెంట్ బయోఫార్మా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం లైఫ్ సైన్సెస్‌లో ప్రపంచ నాయకుడిగా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయి. మా విస్తరిస్తున్న ఆవిష్కరణ-ఆధారిత పర్యావరణ వ్యవస్థకు విలువైన జోడింపుగా ఇది నిలుస్తుంది.” అని అన్నారు. 
 
భారతదేశంలో అత్యంత పరిణతి చెందిన, భవిష్యత్తుపై దృష్టి సారించిన లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థలలో ఒకదాన్ని హైదరాబాద్ అందిస్తుంది, ఇది విస్తృత స్థాయి పరిశ్రమ నైపుణ్యం, బలమైన పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలు, సహాయక విధాన వాతావరణాన్ని మిళితం చేస్తుంది. జనరిక్స్‌లో దాని వారసత్వం, అధునాతన చికిత్సలపై పెరుగుతున్న దృష్టితో, తదుపరి దశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు చక్కటి స్థానంలో నగరం ఉంది. ఎజిలెంట్ బయోఫార్మా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం ఈ పునాదిపై ఆధారపడి ఉంటుంది, స్థానిక ఆవిష్కరణ, ప్రపంచ డెలివరీ రెండింటికీ మద్దతు ఇచ్చే అధునాతన విశ్లేషణాత్మక, నియంత్రణ సామర్థ్యాలను పరిచయం చేస్తుంది.
 
ఈ మూలధన పెట్టుబడి ఎజిలెంట్ యొక్క విస్తృతమైన మూడు నుండి ఐదు సంవత్సరాల భారతదేశ వృద్ధి వ్యూహంలో భాగం, దీనిలో దాని కార్యకలాపాలను విస్తరించడం, కస్టమర్ భాగస్వామ్యాలను మరింతగా పెంచడం, ఎజిలెంట్ యొక్క ప్రపంచ ఆవిష్కరణ, లాభదాయకత రోడ్‌మ్యాప్‌లో భారతదేశాన్ని వ్యూహాత్మక కేంద్రంగా ఉంచడం వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మనేసర్‌లో ప్రారంభించబడిన ఇండియా సొల్యూషన్ సెంటర్, ఈ కొనసాగుతున్న నిబద్ధతను మరింత ప్రతిబింబిస్తుంది - ప్రపంచవ్యాప్తంగా దాని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అధిక ప్రాధాన్యత కలిగిన మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో ఎజిలెంట్ తమ కార్యక్రమాలను, సామర్థ్యాలను పెంపొందించుకునే ప్రయత్నాలకు ఇది దోహదపడుతుంది.
 
"ఎజిలెంట్ ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రముఖ బయోఫార్మా కంపెనీలతో సన్నిహితంగా పనిచేస్తోంది" అని మెక్‌డొనెల్ జోడించారు. "ఈ కేంద్రంతో, మేము ఆ సంబంధాలను బలోపేతం చేయడం, భారతీయ, ప్రపంచ మార్కెట్లలో అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే పరిష్కారాలను సహ-సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు. ఈ మైలురాయి భారతదేశంతో ఎజిలెంట్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది - సహకారాన్ని మరింతగా పెంచడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం మరియు ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడటం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి