ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్డులను ఆగస్టు 31వ తేదీ వరకు పంపిచేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 14597486 మంది లబ్దిదారులకు ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
ఈ పంపిణీ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో మంత్రుల ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు నిర్వహించి అందజేస్తామన్నారు. రేషన్ కార్డు కేవైసీ పూర్తి చేయడంలో ఏపీ 96.05 శాతం మేరకు పూర్తి చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఐదేళ్లలోపు, 80 యేళ్ళు పైబడిన 1147132 మందికి కేవైసీ చేయాల్సిన అవసరం లేదన స్పష్టం చేశారు.