Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

Advertiesment
Dhanush Raghumudri, Rekha Nirosha, Pappu Balaji Reddy

దేవీ

, బుధవారం, 30 జులై 2025 (15:09 IST)
Dhanush Raghumudri, Rekha Nirosha, Pappu Balaji Reddy
ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ను తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఫ్యామిలీ అంతా చూసే విధంగా థాంక్యూ డియర్ చిత్రాన్నిరూపొందించామని చిత్రం డైరెక్టర్ శ్రీకాంత్ తోట తెలిపారు. ఆగస్టు 1వ తేదీన  విడుదల అవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా హెబ్బా పటేల్, త్రంత మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందింది.
 
పప్పు బాలాజీ రెడ్డి నిర్మాత గా రూపొందిన ఈ చిత్రం విడుదల కాకముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక 15th గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తో పాటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కరెంట్ అఫ్ఫైర్స్ చే రిజిస్టర్ కాబడిన బెంగళూరు ఇండియా ఆర్ట్ అండ్ లిటలేచర్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ వెల్రెడ్ అసోసియేషన్ నుంచి హెబ్బా పటేల్ ఉత్తమ నటిగా, డెబ్యూ ప్రొడ్యూసర్ గా పప్పు బాలాజీ రెడ్డి,  సహాయ నటీనటులుగా నాగ మహేష్ , రేఖ నిరోషా అవార్డ్స్ పొందారు. ఈ  చిత్రంలో రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్, మీనాకుమారి, బేబీ ప్రభావతి, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు, వీనిషా, వర్దిని, పప్పు చందు తదితరులు నటించగా పిఎల్కే రెడ్డి డీఓపీగా పని చేశారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ, సినిమాలో కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే లో ఉండబోతుంది. ఒక మంచి సందేశం తో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను ఉండబోతుంది. అలాగే చిత్రానికి ఇప్పటికే ఎన్నో అవార్డులు రావడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
నిర్మాత బాలాజీ మాట్లాడుతూ, చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక బృందం అంతా సినిమాకు బాగా సపోర్ట్ చేశారు" అన్నారు.
 
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ, ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను" అన్నారు. హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ, మా సినిమాను అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకులంతా థియేటర్లలో మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
సంగీత దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ, ఈ సినిమాకు పనిచేసే సమయంలో బాలాజీ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడంతోనే మేము బాగా పని చేయగలిగాము. ఇటువంటి మరెన్నో సినిమాలు ఆయన చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం