Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Advertiesment
Hebba Patel

దేవీ

, శనివారం, 24 మే 2025 (14:21 IST)
Hebba Patel
హైదరాబాద్‌ లోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్‌)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ కొన‌సాగుతుంది.
 
webdunia
Vindhya Gold team with hebba
ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, "ఈవెంట్ చాలా వైవిధ్యంగా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వింధ్య గోల్డ్‌ వంటి నమ్మకమైన బ్రాండ్‌ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని" అని పేర్కొన్నారు. గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులతో పాటు హెబ్బా పటేల్ సంద‌డి చేసి ఉత్సాహ‌ప‌రిచారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్‌లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్