Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

Advertiesment
Payal Rajput

ఐవీఆర్

, గురువారం, 24 ఏప్రియల్ 2025 (18:55 IST)
హైదరాబాద్: చరిత్ర, సంస్కృతి, విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తమ 3వ స్టోర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇప్పటికే బలమైన బ్రాండ్‌ను, నగరంతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకున్న టిబిజెడ్ -ది ఒరిజినల్‌కు చెందిన ఈ స్టోర్, కొండాపూర్ ఐటీ హబ్‌లో ఉన్న నూతన విభాగపు వినియోగదారులకు సేవలు అందించనుంది.
 
భారతీయ కస్టమర్లకు సాంప్రదాయకంగా అత్యధిక కొనుగోలు సీజన్ అయిన అక్షయ తృతీయ మాసంలో ఈ స్టోర్ ప్రారంభించబడుతోంది. టిబిజెడ్- ది ఒరిజినల్ నగరంలో తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ ప్రారంభించిన కొండాపూర్‌లోని కొత్త స్టోర్, సాటిలేని నాణ్యత, కాలాతీత డిజైన్‌ల వాగ్దానంతో, సందడిగా ఉండే ఐటీ హబ్‌లో పూర్తిగా కొత్త కస్టమర్‌లకు సేవలను అందించనుంది. 
 
కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభోత్సవ ఆఫర్‌లను కూడా అందిస్తున్నారు, వాటిలో మొదటి 100 మంది కొనుగోలుదారులకు 100 బంగారు నాణేలు, బంగారం ఆభరణాల తయారీపై 50% తగ్గింపు, వజ్రాల ఆభరణాలపై ఎలాంటి తయారీ చార్జీలు లేకపోవటం, పెరుగుతున్న బంగారం ధరల నుండి రక్షణ కోసం ఫ్లెక్సీ రేటు, కస్టమర్లకు బంగారం రేటుపై అదనంగా రూ. 110/- తగ్గింపు వంటివి ఉన్నాయి.
 
ప్రఖ్యాత నటి పాయల్ రాజ్‌పుత్ చేతుల మీదగా ప్రారంభమైన ఈ స్టోర్ బంగారం, యాంటిక్, టెంపుల్ జ్యువెలరీ యొక్క గొప్ప కలెక్షన్‌ను ప్రదర్శించనుంది. ఇది టిబిజెడ్ -ది ఒరిజినల్ యొక్క అత్యాధునిక తయారీ సౌకర్యాలలో రూపొందించబడిన వజ్రాల ఆభరణాల అద్భుతమైన కలెక్షన్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఇది శ్రేష్ఠత పట్ల బ్రాండ్ యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబించే అత్యున్నత నాణ్యత, ప్రత్యేకత డిజైన్లను నిర్ధారిస్తుంది.
 
కలెక్షన్ లోని ఆకర్షణీయమైన ఫ్యాన్సీ సెట్‌లలో ఒకదానిలో అలంకరించుకున్న పాయల్ రాజ్‌పుత్, టిబిజెడ్ -ది ఒరిజినల్ షోరూమ్‌లలో లభించే విస్తృత శ్రేణి బంగారం, వజ్రాల ఆభరణాలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాటిని ధరించటం ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు. టిబిజెడ్ -ది ఒరిజినల్ యొక్క సిఎండి శ్రీకాంత్ జవేరి తన సంతోషాన్ని పంచుకుంటూ,"ముత్యాల నగరి హైదరాబాద్‌లో మా 3వ స్టోర్‌ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది.
 
మా ప్రస్తుత స్టోర్‌లలో మా కస్టమర్ల ప్రేమ, ఆప్యాయతను ఆస్వాదించే అదృష్టం మాకు కలిగింది. ఈ నగరంతో మా అనుబంధాన్ని మరింతగా పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. పారదర్శక, కస్టమర్-స్నేహపూర్వక విధానం ద్వారా హైదరాబాద్‌లో మా అద్భుతమైన కలెక్షన్‌లను అందించగలగడం, అసమానమైన షాపింగ్ అనుభవాలను అభివృద్ధి చేయగలగడం పట్ల మేము సంతోషిస్తున్నాము. దేశవ్యాప్తంగా 'టిబిజెడ్- ది ఒరిజినల్' అనుభవాన్ని అందించాలనే మా లక్ష్యం దిశగా ఇది మరొక ముందడుగు, మా తత్వశాస్త్రానికి అనుగుణంగా మా కస్టమర్‌లకు "సరైన ఎంపిక, సరైన ధర"ని ఇది అందిస్తుంది" అని అన్నారు. 
 
నటి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, టిబిజెడ్ -ది ఒరిజినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాము. నగరంలో వారి 3వ స్టోర్‌ను ప్రారంభించడానికి నన్ను పిలవడం సంతోషంగా వుంది. ఈరోజు ఈ కలెక్షన్ నుండి అద్భుతమైన సెట్‌లలో ఒకదాన్ని ధరించాను. టిబిజెడ్ – ది ఒరిజినల్ నిజంగా మీకు “సరైన ఎంపిక, మరియు సరైన ధర” ఉత్పత్తులను అందిస్తుంది. అన్ని ఆభరణాల అవసరాలకు నా గమ్యస్థానంగా నిలుస్తోందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...