ప్రతి నెలా శుక్లపక్షం షష్ఠి రోజున స్కంధ షష్ఠిని జరుపుకుంటారు. ఈ రోజున కార్తీకేయ స్వామి ఆరాధన చేస్తారు. కార్తీకేయుడు దేవతల సేనాధిపతి. కార్తీకేయుడిని స్కంధ షష్ఠి రోజున పూజించడం ద్వారా జాతకంలోని సర్వ దోషాలు తొలగిపోతాయి.
స్కంద షష్ఠి రోజున పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల కార్తీకేయుని ఆశీస్సులతో పాటు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికి, కుజ దోష నివారణకు కార్తీకేయుడిని ఆరాధించడం ఉత్తమం. స్కంధ పంచమి, స్కంధ షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత కార్తీకేయ స్వామిని పూజిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది.
అలాగే ఎవరి జాతకంలో అయినా నాగ దోషం, కాల సర్ప దోషం, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యమవుతుంటే స్కంద షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత కార్తీకేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, స్వామి వారికి కళ్యాణం లేదా హోమం చేయిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
స్కంధ షష్టి రోజున పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి, మోక్షానికి మార్గం పొందుతారు.