రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. క్రికెట్ కెరీర్‌లో సలహాలు ఇస్తానంటూ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది.
రాజస్థాన్‌లోని సీతాపురంలో ఓ హోటల్‌కు పిలిచి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆ తర్వాత కూడా రెండేళ్ల పాటూ బ్లాక్ మెయిల్ చేసి మరీ అత్యాచారం చేశాడని యువతి చెబుతోంది. దీంతో అతనిపై రాజస్థాన్ లో పోక్సో కేసు నమోదు అయింది.
లైంగిక వేధింపులు మొదలైనప్పుడు ఆ అమ్మాయి వయసు 17ఏళ్ళు కావడంతోనే ఈ కేసు నమోదు చేశామని రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేరం కనుక రుజువైతే యశ్‌కు కనీసం 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది కేవలం క్రిమినల్ కేసు మాత్రమే కాకుండా, అతడి క్రికెట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.