కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను కిడ్నాప్ చేసి తనతో పాటు ఉంచుకుంటానని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం "కింగ్డమ్". ఈ నెల 31వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ పాల్గొని మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలకు ముందు ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. వారిలో ఒకరు హీరో సూర్య. నాకు మొహమాటం ఎక్కువ. ఎవరిని సాయం అడగలేను. కింగ్డమ్ తమిళ టీజర్‌కు సూర్య వాయిస్ ఇస్తే బాగుంటుందని దర్శకుడు తెలిపారు. నేను ఈ మాట అడగ్గానే సూర్య ఓకే చెప్పారు. ఆయన పవర్‌ఫుల్ వాయిస్ టీజర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చేసింది. థ్యాంక్యూ సూర్య అన్నా అని అన్నారు.
ఇక రెండో వ్యక్తి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. అతడు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు. అతడిని కిడ్నాప్ చేసి నాతోపాటే ఉంచుకోవాలని ఉంది. ఈ సినిమా విషయంలో నేను చెప్పిన అప్‌డేట్స్ కంటే అనిరుధ్ చెప్పినవే వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో కూడా ఈ చిత్రం మా అందరికీ ఒక మైలురాయిగా నిలుస్తుందని అనిరుధ్ చెప్డాడు. ఆ మాటనే ఎంతో మంది షేర్ చేశారు. మరో రెండు రోజుల్లో "కింగ్డమ్" మీ ముందుకురానుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.