Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

Advertiesment
Kingdom - Deverakonda

ఠాగూర్

, ఆదివారం, 27 జులై 2025 (11:06 IST)
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
 
శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ మైదానంలో ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది. 
 
‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.
 
కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, "నేను చేసింది ఒక్క సినిమానే అయినా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. దర్శకుడు గౌతమ్ గారు 'కింగ్డమ్' సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండకి తన వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టాన్ని త్వరలో ప్రేక్షకులు స్క్రీన్‌పై చూడబోతున్నారు. అనిరుధ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీ గారు ఒకే సమయంలో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా.. ప్రతి సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. జూలై 31న విడుదలవుతున్న 'కింగ్డమ్' మీ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను." అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "ఈ 'కింగ్డమ్' సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. నేను, గౌతమ్ 2018లో జెర్సీ సినిమా చేసి జాతీయ అవార్డు అందుకున్నాం. ఆ తర్వాత గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఇది. రెండున్నరేళ్ల నుంచి ప్రొడక్షన్‌లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాని చూపించబోతున్నాము. మీరు ట్రైలర్‌లో చూసింది శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ అభిమానులు గత నాలుగైదు సంవత్సరాలలో ఏం మిస్ అయ్యారో.. ఆ ఇంటెన్సిటీ ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కళ్ళలో ఏ ఇంటెన్సిటీ చూశారో.. అది ఇందులో ఉంటుంది. విజయ్ కోసం నేను, గౌతమ్ 100 శాతం ఎఫర్ట్ పెట్టి.. మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. జూలై 31 విడుదలవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను."
 
‘కింగ్డమ్’ కథ చాలా బలంగా, అద్భుతంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది. కేవలం యాక్షన్‌తో నిండి ఉండటమే కాకుండా.. పాత్రల మధ్య బంధాన్ని చూపించే బలమైన భావోద్వేగాలను కలిగి ఉంది. సూరిగా విజయ్, శివగా సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఆ పాత్రల మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తున్నాయి. ఇవి లోతైన, అర్థవంతమైన అనుభూతిని ఇస్తున్నాయి. మొత్తానికి బలమైన భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన కథను ‘కింగ్డమ్’లో చూడబోతున్నామని ట్రైలర్ తో అర్థమవుతోంది.
 
విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రజెన్స్‌తో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా భావోద్వేగాలను పండించడంలో ఆయన దిట్ట. ఇప్పుడు ‘కింగ్డమ్’ ట్రైలర్ వెండితెరపై విజయ్ అందించే గొప్ప విందును ప్రతిబింబిస్తుంది.
 
ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'కింగ్డమ్' కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. బలమైన నాటకీయతను, భావోద్వేగ క్షణాలతో మిళితం చేస్తూ కథను చెప్పడం గౌతమ్ శైలి. 'కింగ్డమ్‌'లోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు. 
 
జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్‌లు తమ కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, అర్థవంతంగా చూపించారు. ఎడిటర్ నవీన్ నూలి తన పనితీరుతో ట్రైలర్‌ను మరింత శక్తివంతంగా మరియు ఆకర్షణీయంగా మలిచారు.
 
ఇప్పటికే 'హృదయం లోపల', 'అన్నా అంటేనే' గీతాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ట్రైలర్‌లో అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళారు. 
 
ట్రైలర్‌తో ‘కింగ్డమ్’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోన్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. 
 
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..