Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

Advertiesment
Mouni roy at Viswambhara set

దేవీ

, బుధవారం, 30 జులై 2025 (17:41 IST)
Mouni roy at Viswambhara set
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా విశ్వంభర సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో నటి మౌని రాయ్ ప్రత్యేక సాంగ్ లో ప్రవేశించింది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో డాన్స్ చేస్తున్న చిన్న వీడియోను షేర్ చేసింది. అయితే కొద్దిసేపటికే అది డిలీట్ చేయాల్సి వచ్చింది. కాగా, ఆ ఫోటోలో దర్శకుడు విజిల్ వేస్తున్న సీన్ కూడా కనిపించింది.
 
మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందం, గౌరవంగా వుందని మౌనిరాయ్ తెలియజేసింది. ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్  నాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తయింది. ఇటీవలే విదేశాల్లో షూట్ చేసి తిరిగి హైదరాబాద్ వచ్చారు. కథ ప్రకారం విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా వుంటాయని దర్శకుడు తెలియజేస్తున్నాడు. ఈ  పాటకు డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య వ్యవహరించారు. ఈ పాటలో సినిమా ముగింపు దశకు చేరుకుంటుంది. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ