మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అప్రమత్తంగా మెలగండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. న్యాయనిపుణులను సంప్రదించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. వాహనచోదకులకు అత్యుత్సాహం తగదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. స్వయంకృషితోనే కార్యాన్ని సాధిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. నోటీసులు అందుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సేవా, దైవకార్యాల్లో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. రుణ విముక్తులవుతారు. పనులు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
భేషజాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. శ్రీమతి సాయం అందిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆచితూచి అడుగేయండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విపరీతం. సన్నిహితులను కలుసుకుంటారు. పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి చికాకు పడతారు. ఆరోగ్యం బాగుంటుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కష్టం ఫలిస్తుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సర్వత్రా అనుకూలదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. బంధువులతో సంభాషిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పనులు పురమాయించవద్దు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. విందులు, వేడకకు హాజరవుతారు.