Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

Advertiesment
mesham-1

రామన్

, సోమవారం, 28 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఓర్పుతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ఖర్చులు విపరీతం. తప్పనిసరి చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలను వదులుకోవద్దు. వ్యవహారాలతో తీరిక ఉండదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. మీ సలహా అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. విందుకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలున్నాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పొదుపు ధనం గ్రహిస్తారు. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఆప్తుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఎదుటివారి అంతర్యం గ్రహించండి. భేషజాలకు పోవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులు అంచనాలు మించుతాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆప్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రుణ సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట