Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల దూకుడు అదుపు చేయండి...

Advertiesment
daily horoscope

రామన్

, గురువారం, 24 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి చికాకుపడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యతలోపం. కొత్త విషయం తెలుసుకుంటారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలతో తలమునకలవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొంతమంది మీ వైఖరిని తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆహ్వానం అందుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులతో సంభాషిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. తెగిపోయిన సంబంధాలు మెరుగుపడతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. తొందరపడి హామీలివ్వవద్దు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోగయోగ్యమవుతుంది. ఖర్చులు విపరీతం. ఆపన్నులకు సాయం అందిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూలతలున్నాయి. మాట నిలబెట్టుకుంటారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలించవు. ఆలోచనలతో సతమతమవుతారు. మనశ్శాంతి లోపిస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయండి. పట్టుదలకు పోవద్దు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం, వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఖర్చులు అదుపులో ఉండవు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి చికాకుపరుస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలవదు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. తలపెట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వాగ్వాదాలకు దిగవద్దు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు