Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

Advertiesment
daily horoscope

రామన్

, సోమవారం, 21 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ రోజు నిరాశాజనకం. కష్టించినా ఫలితం ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల్లో ఒత్తిడి అధికం. మీ అశక్తతను అయిన వారు అర్ధం చేసుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు కృషి, ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. సమర్ధతకు గుర్తింపు ఉండదు. ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన మొండిగా పనులు పూర్తి చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కలిసివచ్చే సమయం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొత్త యత్నాలు మొదలుపెడతారు. పనులు సాగవు. పనివారల నిర్లక్ష్యం చికాకుపరుస్తుంది. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికం, నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. ముఖ్యులలో ఒకరికి ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పొదుపు ధనం అందుకుంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత లోపం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వాగ్వాదాలకు దిగవద్దు. చిన్న విషయమే వివాదాస్పదమవుతుంది. లౌక్యంగా వ్యవహరించాలి. పనులు ముందుకు సాగవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. సన్నిహితుల సలహా పాటించండి. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు విపరీతం. అంచనాలు ఫలించవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఖర్చులు అధికం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. అప్రతమత్తంగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఓర్పుతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?