మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యానుకూలత ఉంది. ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన సద్దుమణుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. ఏ పని తలపెట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధ సేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
బుద్ధిబలంతో రాణిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. కొత్త ఆలోచనలతో అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ సాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి. వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం వసూలుకు శ్రమిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెద్ద ఖర్చు ఎదురవుతుంది. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో కార్యం సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆత్యీయులకు సాయం అందిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్తవారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి శ్రమించండి. ఆలోచనలు చికాకుపరుస్తాయి. అయిన వారితో సంభాషిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. బెట్టింగులు జోలికి పోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం వృధా కాదు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.