Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Advertiesment
Astrology

రామన్

, మంగళవారం, 15 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఓర్పుతో ముందుకు సాగండి. ప్రయాణం విరమించుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పుతో శ్రమిస్తే విజయం తధ్యం. మనోధైర్యంతో ముందుకు సాగండి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు తగదు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పంతాలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. బంధువులతో స్పర్థలు. తలెత్తుతాయి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరానికి అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పనులతో సతమతమవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, ఆకాలభోజనం, ఆచితూచి అడుగేయండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పొదుపు ధనం అందుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఫోను సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులతో జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆకస్మిక ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యం తలపెడతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పిల్లల మొండితనం చికాకుపరుస్తుంది. గృహ ప్రశాంతతను భంగపరుచుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సర్వత్రా అనుకూలమే. సంప్రదింపులు ఫలిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?