మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. ఖర్చులు విపరీతం. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. మీ సలహా ఆప్తులకు లాభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతి లోపం. మీపై ఎదుటివారికి గురి కుదురుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ప్రయాణం విరమించుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢదీక్షతో శ్రమిస్తే విజయం తథ్యం. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. యత్నాలు కొనసాగించండి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆలోచనలతో సతమతమవుతారు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పరిచయాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అధికం. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఆప్తులకు లాభిస్తుంది. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పనులు పురమాయించవద్దు. పాతమిత్రులను కలుసుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. బాధ్యతలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ రోజు అనుకూలదాయకం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. రావలసిన ధనం అందుతుంది. పరిచయస్తులకు సాయం చేస్తారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం బాగున్నా ఉత్సాహం ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. రోజులు భారంగా గడుస్తున్నట్టనిపిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఒప్పందాలకు అనుకూలం. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆరోగ్యం జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.