Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అంచనాలను మించుతాయి...

Advertiesment
Horoscope nakshatra

రామన్

, శుక్రవారం, 11 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ రోజు అనుకూల సమయం. ఆర్థిక సమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు..
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. ప్రియతములను కలుసుకుంటారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య స్వల్ప కలహం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దైవకార్యంలో పాల్గొంటారు. 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమించినా ఫలితం శూన్యం. మీ సమర్థత ఎదుటివారికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. వెండి, బంగారం కొనుగోలు చేస్తారు. ధనసహాయం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వాక్చాతుర్యంతో రాణిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. వ్యాపకాలు, సృష్టించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సంప్రదింపులతో సతమతవువుతారు. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణ సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు విపరీతం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. నోటీసులు అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనస్థిమితం ఉండదు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య స్వల్ప కలహం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...