మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో వ్యవహరించండి. అందరితో సత్సబంధాలు నెలకొంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఖర్చులు అధికం. సన్నిహితుల కలయిక వీలుపడదు. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ సమర్ధత అవతలివారికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు చురుకుగా సాగుతాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధనలాభం ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు హడావుడిగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. నిస్తేజానికి లోనుకావద్దు. ఏది జరిగినా మంచికేనని భావించండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు అర్థాంతంగా ముగిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు సామాన్యం. అనవసర జోక్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ధనసమస్య ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులు కలిసివస్తాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. చేపట్టిన పనులు సాగవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.