మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. కీలక విషయాలపై దృష్టిపెట్టండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, వాహనం జాగ్రత్త. ప్రయాణం విరమించుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. ఏ పనీ సాగదు. ముఖ్యులతో చర్చలు జరుపుతారు. మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చేతిలో ధనం నిలవదు. ఆలోచనలతో సతమతమవుతారు. కష్ట సమయంలో ఆప్తులు సాయం చేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. వాహనం మరమ్మతుకు గురవుతుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యానుకూలత ఉంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. కొత్త పరిచయాలేర్పడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ప్రతికూలతలు నిదానంగా తొలగుతాయి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణం తలపెడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనుల్లో శ్రమ అధికం. గృహమార్పు చికాకుపరుస్తుంది. బంధుమిత్రుల వ్యాఖ్యలు కష్టం కలిగిస్తాయి. యత్నాలు విరమించుకోవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. సమర్ధతకు గుర్తింపు ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. బంధువులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. చెల్లింపుల్లో మెళకువ వహించండి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, కార్యక్రమాలతో తీరిక ఉండదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతగా వ్యవహరించాలి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు విపరీతం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటకు ఆదరణ లభిస్తుంది. బంధువులతో సత్సంబంధతాలు నెలకొంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. అనుకోని సంఘటనలెదురవుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.