మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అధికం. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కీలక పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మంచి అవకాశం చేజారిపోతుంది. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సాగవు. అనవసర జోక్యం తగదు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. సన్మాన సభలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. బంధుత్వాలు బలపడతాయి. కీలకపత్రాలు అందుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రయాణం తలపెడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణసమస్య పరిష్కారమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రాబడిపై దృష్టి పెడతారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆప్తుల రాకతో కుదుటపడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. అవకాశాన్ని దక్కించుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
మీ తప్పిదాలు సరిదిద్దుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పువస్తుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మీ సమర్ధత ఎదుటివారికి కలిసివస్తుంది. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పసులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ ఓర్పు స్ఫూర్తిదాయకమవుతుంది. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. విందులు, వేడుకలో పాల్గొంటారు.