Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

Advertiesment
Astrology

రామన్

, శుక్రవారం, 27 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికస్థితి సామాన్యం. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. కీలక చర్యల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆశయం నెరవేరుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ప్రయాణంలో అవస్థలు ఎదురుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ సమస్యలను ఆప్తులకు తెలియజేయండి. పంతాలకు పోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు సాగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతాం చదువులపై దృష్టి పెడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపునకు ఆస్కారం లేదు. ఆప్తులతో సంభాషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు అధికం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణసమస్య తొలగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు చురుకుగా సాగుతాయి. శ్రమాధిక్యత, అకాలభోజనం. లావాదేవీల్లో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఖర్చులు విపరీతం. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం