Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-06-2025 మంగళవారం దినఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Advertiesment
horoscope

రామన్

, మంగళవారం, 24 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు సామాన్యం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు ఎదురవుతాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. తలపెట్టిన పనులు ముందుకు సాగవు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఊహించని ఖర్చు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యానుకూలత ఉంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. విలాసాలకు వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనుల్లో శ్రమ అధికం. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పిల్లల ఉన్నత చదువులపై శ్రద్ధ వహించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పెద్దమొత్తం నగదు చెల్లింపుల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అప్రియమైన వార్త వింటారు. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గరుడ పురాణం: 28 రకాల నరకాలుంటాయట.. ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి