Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-06-2025 శుక్రవారం దినఫలితాలు - మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

Advertiesment
astrology

రామన్

, శుక్రవారం, 20 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
కార్యసాధనకు మరింత శ్రమించాలి. భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యం అవుతుంది. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులను దరిచేరనీయవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. నిరుత్సాహానికి గురికావద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆటంకాలు ఎదురైనా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. సాయం ఆశించవద్దు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలు మొదలు పెడతారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ యత్నం ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్యలు తొలగుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటివిషయాలు పట్టించుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. సంతకాల విషయంలో సమయస్ఫూర్తిగా మెలగండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మనోదానికి ఖర్చుచేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ధృఢసంకల్పంతోనే లక్ష్యం సాధిస్తారు, బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆటంకాలు ఎదురైనా మీ కృషి ఫలిస్తుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యం విజయవంతమవుతుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పరిచయాలు, దూరపు బంధుత్వాలు బలపడతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు ప్రయోజనకరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ధనసహాయం తగదు. మీ అశక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. సన్నిహితులను కలుసుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

TTD: అలిపిరి వద్ద తనిఖీల్లో జాప్యం.. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్.. ఎలా?