Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-06-2025 సోమవారం దినఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

Advertiesment
Astrology

రామన్

, సోమవారం, 23 జూన్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలు ఎదురవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి, వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం.పనులు సాగవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. జూదాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం. కీలకపత్రాలు అందుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. పయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణసమస్య కొలిక్కివస్తుంది. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఆదాయ ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. బాధ్యతలు అప్పగించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిచయాలు అధికమవుతాయి. మీ తప్పిదాలు సరిదిద్దుకుంటారు. సమస్యలు సద్దుమణుగుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చిత్తశుద్ధిని చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు ముందుకు సాగవు. దుబారా ఖర్చులు విపరీతం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ధనసహాయం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు