Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Advertiesment
Weekly Horoscope

రామన్

, శనివారం, 12 జులై 2025 (19:19 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్ప బలం ముఖ్యం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అనుకూలతలు అంతంత మాత్రమే. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మొండిగా వ్యవహరిస్తారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. నోటీసులు అందుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగ విధులను అలక్ష్యం చేయవద్దు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ కష్టం వృధా కాదు. శ్రమించే కొద్దీ ఫలితాలుంటాయి. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. సోమవారం నాడు పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చేతివృత్తుల వారికి ఆశాజనకం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. నిర్దేశిత లక్ష్యాలు రూపొందించుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు గురికావద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అయిన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. చిరువ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. కొత్త బాధ్యతలు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడపుతారు. మీ అలవాట్లు అదుపునలో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. కొందరి వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. గురువారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. ఏ విషయంలోనూ సొంత నిర్ణయాలు తగవు. ఆచితూచి అడుగేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళవారం నాడు ఊహించని ఖర్చు ఎదురవుతుంది. సాయం ఆశించి భంగపడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. గృహమార్పు అనివార్యం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇబ్బంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. విధినిర్వహణలో అలక్ష్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉపాధి పథకాలు చేపడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నస్తేజానికి గురవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. శుక్రవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వాస్తుదోష నివారణ చర్చలు చేపడతారు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఉద్యోగ విధుల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. దూరప్రయాణం తలపెడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. అభీష్టం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్సు, చిట్స్ రంగాలకు దూరంగా ఉండండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు, ఔషధ సేవనంలో అలక్ష్యం తగదు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదువులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచికే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మనోధైర్యంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలతో జాగ్రత్త. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధవహించండి. ధనస్రపలోబాలకు గురికావద్దు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలలు అధికం. ఆలోచనలతో సతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆశావహదృకృతంతో మెలగండి. ఈ సమస్యలు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. సోమ, మంగళవారాల్లో పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం పొదుపుగా ఖర్చుచేయండి. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలు, దళారులను ఆశ్రయించవద్దు. వృత్తి ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. మీ కష్టం వృధాకాదు. అధికారులు మీ సమర్ధతను గుర్తిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు, పెట్టుబడులు కలిసిరావు. బిల్డర్లు, కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. గురువారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలను జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. అన్నిటా మీదే పైచేయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకు చక్కని సలహాలిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాధ్యమవుతాయి. సంతానం అత్యుత్సాహం వివాదాస్పదమవుతుంది. రాజీమార్గంలో సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. విందులకు హాజరవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?