Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Advertiesment
astrology

రామన్

, శుక్రవారం, 25 జులై 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఆచితూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెళకువ వహించండి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. వ్యాపకాలు అధికమవుతాయి. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కొంతమంది వ్యాఖ్యలు బాధిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ధనసమస్య ఎదురవుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. పనుల్లో శ్రమ అధికం. ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. పిల్లల పై చదువులపై దృష్టి పెడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. పనులు ఒక పట్టాన సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ పని మొదలెట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండేందుకు యత్నించండి. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. రాబడిపై దృష్టి పెడతారు. ప్రమఖుల సందర్శనం వీలుపడదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఓర్పుతో యత్నాలు సాగించండి. మంచి అవకాశం చేజారిపోతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఖర్చులు విపరీతం. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ సామర్ధ్యంపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. ధన సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులు ఆదుకుంటారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది. విందులకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అయిన వారు ప్రోత్సహిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. పాత పరిచయస్తులు తారసపడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అనవసర జోక్యం తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?