Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Advertiesment
Ranna, Priyanka Achar

దేవీ

, బుధవారం, 30 జులై 2025 (18:51 IST)
Ranna, Priyanka Achar
రాన్నా, ప్రియాంక ఆచార్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో  తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ఏలుమలై’. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు ‘ఏలుమలై’ నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
 
సిధ్ శ్రీరామ్ ఆలపించిన ‘రా చిలకా’ అనే పాట శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు డి. ఇమ్మాన్ బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటలో చూపించిన లొకేషన్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ చూస్తుంటే ఈ చిత్రంలో అందమైన ప్రేమ కథ దాగి ఉందని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ‘రా చిలకా’ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో అందరినీ మెప్పించేలా ఉంది. 
 
కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్, సేలం, ఈరోడ్ వంటి వివిధ ప్రదేశాలలో ఈ మూవీని చిత్రీకరించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు