Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ఇప్పుడు అమ్మకానికి నథింగ్ ఫోన్ 3, నథింగ్ హెడ్‌ఫోన్ 1

Advertiesment
image

ఐవీఆర్

, బుధవారం, 16 జులై 2025 (00:03 IST)
లండన్‌ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ కంపెనీ నథింగ్, రెండు సరికొత్త ఉత్పత్తులు- తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ నథింగ్ ఫోన్ (3), మొట్టమొదటి ఓవర్‌-ఇయర్‌ ఆడియో ఉత్పత్తి నథింగ్ హెడ్‌ఫోన్ (1)ను భారతదేశంలో ఈ మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటున్నట్టు నేడు ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగదారులు తిరిగి ఊహించుకునేలా ఉద్దేశపూర్వక డిజైన్, గొప్ప సృజనాత్మకతతో కూడిన ఈ రెండు ఉత్పత్తులు Nothing దార్శనికతను ప్రతిబింబిస్తాయి.
 
నథింగ్ ఫోన్‌ (3) 
స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలు ఏర్పరుస్తూ వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెడుతోంది. Nothing ఫోన్ (3). ప్రో-గ్రేడ్‌ ట్రిపుల్‌ కెమెరా సిస్టమ్‌తో పాటు ఈ శ్రేణిలో ఎక్కువ, తక్కువ లైట్‌ షాట్స్‌ కోసం అగ్రశేణి 1/1.3” మెయిన్‌ సెన్సర్‌, లాస్‌లెస్‌ ఆప్టికల్‌ జూమ్‌, పూర్తి ఇమేజ్‌ స్థిరత్వం కోసం అన్ని లెన్సుల్లో సినిమాటిక్‌ 4K 60fps వీడియో ఉంది. ప్రీమియం మాడ్యూలార్‌ డిజైన్‌లో అల్ట్రా-న్యారో  బెజిల్స్‌తో అద్భుతమైన 6.67” ఆమోలెడ్‌ డిస్‌ప్లే, శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 4 చిప్‌ ఉంది.
 
విప్లవాత్మక Glyph Matrixతో యూజర్లు ముఖ్యమైన సమాచారాన్ని ఒక చూపులోనే పొందవచ్చు. అంతేకాదు ఫ్లిప్‌ టు రికార్డు, Glyph బొమ్మలతో సరదా అనుభూతులు ఆస్వాదించవచ్చు. సరికొత్త ట్రై-కాలమ్‌ లేఔట్‌తో కూడిన ఫోన్(3)లో రీ-డిజైన్ చేసిన R-యాంగిల్ అందాన్ని మెరుగుపరుస్తుంది. ముందుభాగంలో ఏకరీతి 1.87 ఎంఎం బెజెల్స్‌తో ఇది ఫోన్ (2) కంటే 18% సన్నగా, పదునుగా, మరింత మైమరపింపజేసే ఆమోలెడ్‌ స్క్రీన్‌ కలిగి ఉంటుంది.
 
Nothing హెడ్‌ఫోన్‌ (1)
Nothing Headphone (1) ద్వారా ఓవర్‌-ఇయర్‌ ఆడియో కేటగిరీలోకి Nothing ప్రవేశిస్తోంది. KEF సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తి ఆకట్టుకునే డిజైన్‌, కచ్చితమైన ఇంజినీరింగ్‌కు మేళవింపు. కస్టమ్‌ 40 ఎంఎం డైనమిక్ డ్రైవర్ నుంచి హెడ్‌ ట్రాకింగ్‌తో రియల్‌ టైమ్‌ స్పాటియల్‌ ఆడియో వరకు ఇది మైమరపింపజేసే లోతైన శ్రవణానుభూతిని అందిస్తుంది. అల్యూమినియం, PU మెమొరీ ఫోన్‌ సహ ప్రీమియం పదార్ధాల సమ్మేళనంతో కూడిన ఈ ఉత్పత్తి రోజంతా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులోని ది రోలర్‌, ప్యాడిల్‌, బటన్‌ - సిగ్నేచర్‌ టాక్టైల్‌ కంట్రోల్స్‌ వ్యాల్యూమ్, మీడియా, ANCలో నిరంతరాయ నియంత్రణను అందిస్తాయి.
 
రోజంతా వింటూ ఉండే నిర్మాణంతో పాటు ఆడియోఫైల్‌ గ్రేడ్‌ పనితీరుతో Nothing HeadPhone (1) హై-రెజల్యూషన్‌ ఆడియో, LDAC, USB-C లాస్‌లెస్‌ ప్లేబ్యాక్‌, 3.5 ఎంఎం వైర్డ్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. ANCలో ఇది 35 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ కలిగి ఉంటుంది, 5 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌తో 2.4 గంటల పాటు దీనిని వినవచ్చు. డ్యూయల్‌ డివైస్‌ కనెక్టివిటీ, ఏఐ శక్తితో కాల్‌ క్లారిటీ, ఛానెల్‌ హాప్‌ వంటి ఇన్‌-యాప్‌ కస్టమైజేషన్‌, అడ్వాన్స్‌డ్‌ EQ వంటివి సౌకర్యంతో పాటు వ్యక్తిగతీకరణను అందిస్తాయి.
 
Nothing Phone (3) ధర: 
రెండు కాన్ఫిగరేషన్ రకాలు, బ్ల్యాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌ ఆప్షన్స్‌తో ఫోన్‌ (3) అందుబాటులో ఉంది:
 
12 జీబీ + 256 జీబీ – ప్రారంభ ధర రూ.62,999 (HDFC, ICICI, IDFC బ్యాంక్‌ అందించే) రూ.5,000 బ్యాంక్‌ ఆఫర్‌ సహ + ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌
16 జీబీ + 512 జీబీ – ప్రారంభ ధర రూ.72,999 (HDFC, ICICI, IDFC బ్యాంక్‌ అందించే) రూ.5,000 బ్యాంక్‌ ఆఫర్‌ సహ + ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌
జులై 15న ఫోన్‌ కొనుగోలు చేసేవారు ఒక సంవత్సరం అదనపు వారెంటీ అందుకుంటారు.
ప్రముఖ బ్యాంకుల ద్వారా 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా నథింగ్ అందిస్తోంది. 
 
ఎంపిక చేసిన డివైసులపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు
 లభ్యత: 
జులై 15, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్, విజయ్‌ సేల్స్, క్రోమా సహ అన్ని ప్రముఖ రిటెయిల్‌
 
స్టోర్స్‌లో Nothing Phone (3) అందుబాటులో ఉంటుంది. 
Nothing హెడ్‌ఫోన్‌ (1):
ధర: 
భారతీయ మార్కెట్‌లో బ్ల్యాక్‌ అండ్‌ వైట్‌ రకాల్లో రూ.21,999లకు HeadPhone (1) అందుబాటులో ఉంటుంది. ప్రవేశపెడుతున్న సందర్భంగా జులై 15, 2025న ప్రత్యేకంగా రూ.19,999కే దీనిని వినియోగదారులు పొందవచ్చు.
 
ప్రముఖ బ్యాంకుల ద్వారా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ నుంచి కూడా 12 నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్స్‌ను నథింగ్‌ సమకూర్చుతుంది.
లభ్యత: 
జులై 15, 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్, విజయ్‌ సేల్స్, క్రోమా సహ అన్ని ప్రముఖ రిటెయిల్‌ స్టోర్స్‌లో Nothing Headphone (1) లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎంటీసీకి 148 అడ్వాన్స్‌డ్ స్టార్‌బస్ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీని ప్రారంభించిన టాటా మోటార్స్