Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2026లో కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న ఆపిల్.. ఐఫోన్ 17e ఎప్పుడంటే?

Advertiesment
Apple

సెల్వి

, శుక్రవారం, 11 జులై 2025 (19:23 IST)
2026 ప్రథమార్థంలో కొత్త లో-ఎండ్ ఐఫోన్, అలాగే ఐప్యాడ్‌లు, అప్‌గ్రేడ్ చేసిన మాక్‌లతో సహా కొత్త ఉత్పత్తులను ఆపిల్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆపిల్ ఎంట్రీ-లెవల్ టాబ్లెట్, ఐప్యాడ్ ఎయిర్‌కు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ 17e గా పిలువబడే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆపిల్ ప్రారంభించిన $599 మోడల్‌కు కొనసాగింపుగా ఉంటుంది. కంపెనీ అప్‌గ్రేడ్ చేసిన మ్యాక్‌బుక్ ప్రోస్, ఎయిర్స్‌పై కూడా పని చేస్తోందని, ప్లాన్‌లు ప్రైవేట్‌గా ఉన్నందున వారి పేర్లు వెల్లడించలేదు. 
 
ఇక ఐఫోన్ 17e ఫోనులో ఆపిల్ తన ట్రూడెప్త్ సెల్ఫీ కెమెరా రిజల్యూషన్‌ను 12-మెగాపిక్సెల్ నుండి 24-మెగాపిక్సెల్‌కు రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇది ప్రో మోడళ్లకు మాత్రమే కాకుండా సాధారణ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్‌లకు కూడా వర్తిస్తుంది. 
 
ఈ అప్‌గ్రేడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల నాణ్యతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2026 నుండి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఆపిల్ ఈ లక్షణాలలో దేనినీ అధికారికంగా ధృవీకరించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 12 అర్థరాత్రి నుంచి 14 అర్థరాత్రి వరకూ అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌లో అగ్ర ప్రైమ్ డే డీల్స్