Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎంటీసీకి 148 అడ్వాన్స్‌డ్ స్టార్‌బస్ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీని ప్రారంభించిన టాటా మోటార్స్

Advertiesment
TATA EV bus

ఐవీఆర్

, మంగళవారం, 15 జులై 2025 (23:51 IST)
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(BMTC)కి అదనంగా 148 అధునాతన టాటా స్టార్‌బస్ ఎలక్ట్రిక్ బస్సుల డెలివరీలను ప్రారంభించినట్లు భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్  ఈరోజు ప్రకటించింది. ఈ తాజా విస్తరణ నగరంలో 921 ఎలక్ట్రిక్ బస్సుల విజయవంతమైన కార్యకలాపాలపై ఆధారపడి ఉంది. ఇది సుస్థిర పట్టణ చలనశీలతకు బెంగళూరు నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. ఈ వాహన సముదాయాన్ని 12 సంవత్సరాల ఒప్పందం కింద టాటా మోటార్స్ పూర్తి  యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన TML స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఆపరేట్ చేసి నిర్వహిస్తుంది.
 
కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కర్ణాటక ప్రభుత్వ రవాణా మంత్రి శ్రీ రామలింగారెడ్డి మరియు బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ రామచంద్రన్, బీఎంటీసీ  సీనియర్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎంటీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ, ‘‘బెంగళూరు అంతటా ఇప్పటికే నడుస్తున్న టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ బస్సులు అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. పని చేయడంలో అధిక సమయ వ్యవధిని సాధించాయి. సౌకర్యం, సౌలభ్యంపై ప్రజల అంచనాలను అందుకున్నాయి. ఈ విజయం ఆధారంగా, టాటా మోటార్స్ నుండి అద నంగా 148 ఇ-బస్సులను చేర్చుకోవడానికి మేం సంతోషిస్తున్నాం. ఈ బస్సులు బెంగళూరు అంతటా విస్తృత నెట్‌వర్క్‌లో ప్రజ లకు సురక్షితమైన, సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రయాణ ఎంపికను అందించే మా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి’’ అని అన్నారు.
 
టాటా మోటార్స్, టీఎంఎల్ స్మార్ట్ సిటీ మొబిలిటీ లిమిటెడ్ & కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ శ్రీ ఎస్ ఆనంద్  మాట్లాడుతూ, ‘‘మేం షెడ్యూల్ ప్రకారం బీఎంటీసీకి మా పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన స్టార్‌బస్ ఎలక్ట్రిక్ బస్సుల మరో ఫ్లీట్ డెలివరీలను ప్రారంభించడం ఒక చిరస్మరణీయ సందర్భం. మా ఉత్పత్తులపై మాత్రమే కాకుండా, రెండు సంవత్సరాల పాటు అసమానమైన అప్‌టైమ్‌ను అందించగల మా సామర్థ్యంపై BMTC చూపిన నమ్మకం మాకు గౌరవం. సాంకేతికత, సర్వీస్, అమలు ద్వారా మద్దతు ఇవ్వబడిన వినూత్నమైన ఇ-మొబిలిటీ పరిష్కారాలను అందించడం ద్వారా సుస్థిరమైన ప్రజా రవాణా అందించాలన్న బీఎంటీసీ ఆశయానికి మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
టాటా స్టార్‌బస్ ఈవీ ఇంటెన్సివ్ ఇంట్రా-సిటీ కార్యకలాపాల కోసం రూపొందించబడింది. అత్యుత్తమ సౌకర్యాన్ని, భద్రతను, అధిక సమయాన్ని అందిస్తుంది. అధునాతన ఎలక్ట్రిక్ బస్సులో కొత్త తరం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఉన్నాయి. లో-ఫ్లోర్ డిజైన్, 35 మంది ప్రయాణీకులకు ఎర్గోనామిక్ సీటింగ్‌తో, ఇది సున్నితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. సున్నా టెయిల్‌పైప్ ఉద్గారాలతో, స్టార్‌బస్ ఈవీలు బెంగళూరు లో పరిశుభ్రమైన గాలికి గణనీయంగా దోహదపడ్డాయి. బెంగళూరు తన గ్రీన్ ఫ్లీట్‌ను విస్తరిస్తున్నందున, టాటా మోటార్స్, బీఎం టీసీ ప్రజా రవాణా భవిష్యత్తుకు ఎలా సిద్ధంగా ఉన్నాయో,ప్రజలకు ఎలా ప్రాధాన్యత ఇవ్వగలదో ప్రదర్శిస్తూనే ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండిగో బ్లూచిప్స్‌తో శక్తివంతమైన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తిరిగి ప్రారంభించిన కోటక్, ఇండిగో